లోకేష్‌పై నిప్పులు చెరిగిన మంత్రి

Anil Kumar Yadav Fires On Lokesh. టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేష్ పై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో

By Medi Samrat  Published on  20 Jun 2021 8:24 AM GMT
లోకేష్‌పై నిప్పులు చెరిగిన మంత్రి

టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేష్ పై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూళ్లూరుపేటలో జరిగిన నెర్రికాలువ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. తాము ఎప్పుడు సంస్కారం లేకుండా మాట్లాడ‌లేద‌ని.. సంస్కారం లేకుండా మాట్లాడుతున్నది లోకేష్ అని అందరికి తెలుస్తుందన్నారు. తనను, కొడాలి నానిని నోటిపారుదల, బూతుల మంత్రి అంటున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ఇక జీవితంలో ఏపీలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని, అందుకే చంద్రబాబు హైదరాబాద్ కు మకాం మార్చేసాడన్నారు.


ఆవేశం అంద‌రికీ ఉంటుంద‌ని.. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని, తాము నోరుతెరిస్తే తట్టుకోలేరని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఇదిలావుంటే.. రెండు రోజుల క్రితం క‌ర్నూలులో టీడీపీ నేత‌ల హ‌త్య‌ల నేఫ‌థ్యంలో కుటుంబాల‌ను ప‌రామార్శించేందుకు వెళ్లిన‌ లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేఫ‌థ్యంలో నిన్న మంత్రి కొడాలి నాని.. లోకేష్, చంద్ర‌బాబుల‌పై ఫైర్ అవ్వ‌గా.. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.


Next Story
Share it