రెండ్రోజుల అధికార పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ బృందం గుజరాత్‌లో పర్యటిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా మంత్రి నారాయణ, ఆయన బృందం అధ్యయనానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి నారాయణ ఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని పరిశీలించారు. అహ్మదాబాద్ శివారులో గిఫ్ట్ సిటీని మంత్రి నారాయణ బృందం పరిశీలించింది. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ అధికారులు పటేల్ విగ్రహం చుట్టుపక్కల నిర్మించిన ఇతర నిర్మాణాలు కూడా పరిశీలించారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహం నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ అధికారులు మంత్రి నారాయణ బృందానికి వివరించారు.