బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ మూడు జిల్లాలకు రెయిన్‌ అలర్ట్‌.!

Andhrapradesh weather alert. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని

By అంజి  Published on  29 Oct 2021 9:17 AM GMT
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ మూడు జిల్లాలకు రెయిన్‌ అలర్ట్‌.!

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరంకు దగ్గరగా ఉందని తెలిపింది. అల్పపీడనంతో పాటు ఉపరితల ద్రోణి శ్రీలంక తీరానికి దగ్గరగా కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

కొత్తపట్నం దగ్గరలోని సముద్ర తీరంలో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల తాకిడికి లంగరు వేసిన ఓ బోటు కొట్టకుపోయింది. సముద్రంలో 2 కి. మీ మేర కొట్టుకుపోయిన బోటును మత్స్యకారులు అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. బోటుకు తాళ్లను కట్టి ట్రాక్టర్లతో లాగారు. దీంతో బోటుకు డ్యామేజ్‌ అయింది. రూ.10 లక్షల విలువైన రింగు వల ధ్వంసమైంది. బోటు తిరగబడడంతో ఇంజన్‌ కూడి చెడిపోయింది. మొత్తంగా రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. ఈ రింగు వలపై ఆధారపడి దాదాపు 70 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వం కల్పించుకుని తగిన నష్టపరిహారం ఇవ్వాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు.

Next Story