అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు, ఫ్యామిలీ పింఛన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్‌ను జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించాలని అధికారులు సూచించారు. లేదంటే ఏప్రిల్ 1న ఇచ్చే మార్చి నెల పెన్షన్ ఆగిపోతుందని తెలిపారు. జీవన్ ప్రమాణ పోర్టల్ లేదా వ్యక్తిగత సీఎఫ్‌ఎంఎస్ లాగిన్ లేదా ఏదైనా ట్రెజరీ ఆఫీసులోగానీ సమర్పించవచ్చని తెలిపారు. పెన్షనర్ల ఆధార్, మొబైల్ నంబర్, పీపీవో నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ సరిచూసుకోవాలన్నారు.
లైఫ్ సర్టిఫికేట్ అంటే..
ఇది పెన్షనర్ జీవించి ఉన్నారని, వారికి పెన్షన్ కొనసాగడానికి అర్హత ఉందని తెలిపే ఒక డిజిటల్ ఆధారం. లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్) అనేది పెన్షనర్లు బ్రతికే ఉన్నారని నిరూపించుకోవడానికి, పెన్షన్ పొందడానికి అవసరమైన డిజిటల్ ధృవీకరణ పత్రం, దీనిని UMANG యాప్ లేదా పోస్టాఫీస్ ద్వారా బయోమెట్రిక్ (వేలు/కనుపాప/ముఖం) ప్రామాణీకరణతో సులభంగా సృష్టించుకోవచ్చు, దీనివల్ల పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీకి ఆటోమేటిక్‌గా వెళ్తుంది, భౌతికంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు.