ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie. ap. gov. inలో పొందవచ్చు అని తెలిపారు. అదే విధంగా మన మిత్ర వాట్సాప్ నెంబర్ (9552300009)లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.