బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు మీటింగ్, ఆ ఫౌండేషన్‌తో ఏపీ సర్కార్ ఒప్పందాలు

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు.

By Knakam Karthik
Published on : 19 March 2025 2:30 PM IST

Telugu News, Andrapradesh, Cm Chandrababu, Microsoft Founder Billgates

బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు మీటింగ్, ఆ ఫౌండేషన్‌తో ఏపీ సర్కార్ ఒప్పందాలు

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఢిల్లీలో దాదాపు 40 నిమిషాల సమయం పాటు ఇద్దరి సమావేశం జరిగింది. గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం అందించనుంది.

అటు ఉద్యోగ, ఉపాధి, గవర్నెన్స్ అంశాల్లో గేట్స్ ఫౌండేషన్, ఏపీ సర్కార్ ఒప్పందాలు చేసుకున్నాయి. అన్ని రంగాల్లో ఏఐ అనుసంధానం, ఉత్తమ ఫలితాల సాధనకు అవసరమైన సహకారాన్ని గేట్స్ ఫౌండేషన్ నుంచి ఏపీ ప్రభుత్వం పొందనుంది. కాగా ఆయా రంగాలకు చెందిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలను గేట్స్ ఫౌండేషన్ కుదర్చుకోనుంది. వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్‌గేట్స్‌తో చంద్రబాబు సమావేశమై పలు ఒప్పందాల పై చర్చించారు.

బిల్‌ గేట్స్‌తో మీటింగ్ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. బిల్‌ గేట్స్‌ను అమరావతి, తిరుపతి రావాలని కోరా. అందుకు ఆయన అంగీకరించారు. 1995 నుంచి బిల్‌గేట్స్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story