సీ ప్లేన్ లో నేడు ప్రయాణం చేయనున్న సీఎం చంద్రబాబు.. అక్కడ హై సెక్యూరిటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సీ ప్లేన్ లో ప్రయాణం చేయనున్నారు.

By Medi Samrat  Published on  9 Nov 2024 10:45 AM IST
సీ ప్లేన్ లో నేడు ప్రయాణం చేయనున్న సీఎం చంద్రబాబు.. అక్కడ హై సెక్యూరిటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సీ ప్లేన్ లో ప్రయాణం చేయనున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్ ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. పున్నమి ఘాట్‌ నుంచి సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లో ప్రయాణిస్తారు. సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం 10:30 గంటలకు పున్నమి ఘాట్ వద్దకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సీ ప్లేన్ లో శ్రీశైలం చేరుకుంటారు. ఆ తర్వాత శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీప్లేన్‌ను శనివారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నందున శ్రీశైలం ఆలయం, పరిసర ప్రాంతాల చుట్టూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నల్లమల అటవీప్రాంతం దృష్ట్యా ముఖ్యమంత్రి భద్రత కోసం 10 ప్రత్యేక బృందాలు, 4 గ్రేహౌండ్ స్క్వాడ్‌లతో సహా 523 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. లాంఛనంగా సీప్లేన్ ప్రారంభించిన తర్వాత, సీఎం చంద్రబాబు పాతాళగంగ బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. నల్లమల అడవుల్లో గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు ఆలయం సమీపంలో ఉండడంతో పోలీసు శాఖ బలగాలను పెంచి ఆ ప్రాంతంలో కూంబింగ్‌ను ప్రారంభించింది.

Next Story