కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త

కొత్త పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్‌ పెన్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపింది.

By -  అంజి
Published on : 25 Feb 2026 10:06 AM IST

Andhra Pradesh, AP government, new pensions, CM Chandrababu

కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త

అమరావతి: కొత్త పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్‌ పెన్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. మార్చి 1న ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28నే పెన్షన్లు అందజేయనున్నట్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62.76 లక్సల మందికి రూ.2,725 కోట్లను పంపిణీ చేయనున్నట్టు పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, మంచానికే పరిమితైన వారికి రూ.15 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. మార్చి 28న పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. మరోవైపు 28న పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2న ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని రావివలస గ్రామంలో అర్హులైన వృద్ధులకు మరియు ఇతరులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తారని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మంగళవారం తెలిపారు. ముఖ్యమంత్రి, లబ్ధిదారుల మధ్య ప్రత్యక్ష సంభాషణ కోసం బహిరంగ సభ నిర్వహించబడనున్న రావివలస మరియు సమీపంలోని పైలపేట గ్రామాన్ని ఇద్దరు అధికారులు సందర్శించారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు కూడా వేదికను సందర్శించి అధికారులకు కొన్ని సూచనలు అందించారు.

Next Story