Video : పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది

By Medi Samrat  Published on  16 Sept 2024 12:58 PM IST
Video : పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది.

ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను ఈ రోజు ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు.

Next Story