దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ : మంత్రి చెల్లుబోయిన
Andhra Pradesh is the state that attracts the most investments in the country. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా
By Medi Samrat Published on 13 Feb 2023 2:15 PM GMTరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా మంచి పురోగతిని సాదిస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు. అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్టమైన పలు ప్రణాళికల వల్లే ఇది సాద్యమైందని ఆయన పేర్కొన్నారు. సోమవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ.. గత మూడున్నర్రేళ్లలో జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన అభివృద్ది, సంక్షేమ ప్రగతిని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా మంచి పురోభివృద్ది సాదిస్తూ దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా ముందుకు దూసుకువెళుతున్నది ఆయన తెలిపారు.
దేశంలోనే అత్యంత వేగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందుతున్నదని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాల జీవితాల మార్పుకి పెట్టుబడే లక్ష్యంగా పలు వినూతన్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుచున్నదన్నారు. నవరత్నాలు పథకాలు అమల్లో భాగంగా రాష్ట్రంలోని పేదలందరికీ ఇప్పటి వరకూ దాదాపు రూ.1.92 లక్షల కోట్ల పైనే సంక్షేమానన్ని అందించడం జరిగిందని ఆయన తెలిపారు.
దేశంలోనే అత్యధిక స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, సులభతరంగా అనుమతులు మంజూరీకీ అమలు చేస్తున్న సింగిల్ విండోవ ధానం మరియు ఎం.ఎస్.ఎం.ఇ.లకు, పరిశ్రమల స్థాపనకు అందజేస్తున్న పలు రకాల ప్రోత్సహాకాల కారణంగా గత నాలుగేళ్ల నుండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో (వ్యాపారం చేయడం సులభం) ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందన్నారు.
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ (DPIIT) నివేదిక ప్రకారం 2022 జూలై చివరి నాటికి దేశ వ్యాప్తంగా రూ.1,71,285 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అందులో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీపడి రూ.40,361 కోట్ల మేర పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, పెట్టుబడిలను రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలోను, పరిశ్రమల స్థాపనలో 3 వ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. అయితే దక్షిణ భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు అంశాల్లోనూ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.