టీటీడీ బోర్డులో నేరచరితులా..? ఏపీ హైకోర్టు ఆగ్రహం

Andhra Pradesh High Court on TTD Board Members.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 1:23 PM IST
టీటీడీ బోర్డులో నేరచరితులా..? ఏపీ హైకోర్టు ఆగ్రహం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. దీనిపై మూడు వారాల్లోగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలిని నియమించిన సంగ‌తి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశమివ్వడంతోపాటు పలువురిని బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా.. పాలకమండలి సభ్యులుగా నేర చరిత్ర ఉన్న వారిని నియమించారంటూ జీవోను సవాల్ చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధ‌వారం విచార‌ణ జ‌రిగింది. పిటిష‌న‌ర్ త‌రుపున న్యాయ‌వాది అశ్వినికుమార్ వాద‌న‌లు వినిపించారు. ఎంసీఐ మాజీ చైర్మ‌న్ డా.కేత‌న్ దేశాయ్ నియామ‌కంపై అశ్వినికుమార్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని, మూడు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

Next Story