ఏపీలో పెన్షనర్లు ఈ విషయాన్ని తెలుసుకోండి..!

Andhra Pradesh govt to hike pension to Rs 2,750 from Jan 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు జనవరి 1 నుంచి పెన్షన్ మొత్తం పెరగనుంది.

By Medi Samrat  Published on  31 Dec 2022 11:41 AM GMT
ఏపీలో పెన్షనర్లు ఈ విషయాన్ని తెలుసుకోండి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు జనవరి 1 నుంచి పెన్షన్ మొత్తం పెరగనుంది. ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ మొత్తం రూ. 2,750 ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వారోత్సవాలను నిర్వహించనుంది ప్రభుత్వం. రెండు వారాల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ల పెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ మొత్తం రూ. 2,750 అందివ్వనున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 2,500 లకు అదనంగా 250 పెంచారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 'నవరత్నాలు' హామీలో భాగంగా పెన్షన్‌ను దశల వారీగా పెంచుతామని, మొత్తం రూ. 3,000 అందిస్తామని ప్రకటించారు. ఆ హామీ మేరకు ఏటా రూ. 250 చొప్పున పెన్షన్‌ను పెంచుతూ వస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేసింది ప్రభుత్వం. దేశంలోనే అత్యధికంగా 64 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. జనవరి 3వ తేదీన రాజమండ్రిలో పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.




Next Story