ఏపీ ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడిగింపు

Andhra Pradesh Govt Advisers Tenure Extended. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌ సలహాదారుల పదవీకాలం పొడిగిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం

By Medi Samrat  Published on  2 Jun 2021 6:41 AM IST
ఏపీ ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడిగింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌ సలహాదారుల పదవీకాలం పొడిగిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, రఘురాంల పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం పదవీకాలం కూడా పొడిగించారు. ఈ నలుగురి పదవీకాలం ఈ జూన్ నెల‌లో ముగియ‌నున్న నేఫ‌థ్యంలో మరో ఏడాది పొడిగిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. స‌ల‌హాదారుల‌లో అజేయ క‌ల్లం.. 'జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు- భూ ర‌క్ష ప‌థ‌కం' అమ‌లు, స్టీరింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గాను కొన‌సాగుతున్నారు. అలాగే.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఐఏఎస్‌ నవ్యను నియమించారు. నవ్య నియామకాన్ని ఖరారు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.



Next Story