అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా సెలవులను మరో రెండ్రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయుల విన్నపం చేయడంతో టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల విజ్ఞప్తిని లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేశ్ పేర్కొన్నారు. దీంతో ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఉండనున్నట్లు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.