ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఏపీలో ఎప్పటి నుండి అంటే!!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2024 7:54 PM IST
Andhra Pradesh, free bus,  women, government ,

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఏపీలో ఎప్పటి నుండి అంటే!!   

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పటి నుండి వస్తుందా అని ఏపీ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.

పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ నిర్ణయం స్ఫూర్తి పొందిందని, ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా అమలు చేసేందుకు సమగ్ర పరిశోధనలు నిర్వహిస్తామని రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కడప పర్యటనకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రాంప్రసాద్ రెడ్డి నేడు కడపలోని విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు

Next Story