ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత
Andhra Pradesh Former CM Konijeti Rosaiah Passed Away . మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఒక్కసారిగా పల్స్ పడిపోవడంతో రోశయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే
By అంజి Published on 4 Dec 2021 9:05 AM ISTఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఒక్కసారిగా పల్స్ పడిపోవడంతో రోశయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రోశయ్య కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే రోశయ్య చనిపోయారు. రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పని చేశారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ గానూ పనిచేశారు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో కొణిజేటి రోశయ్య జన్మించారు.
1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో కొణిజేటి రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి రోశయ్య అత్యంత ఆప్తులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును రోశయ్య ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.
స్వాతంత్య్ర యోధుడు రోశయ్య.. రైతు నాయకుడు కూడా. ఎన్.జి.రంగా దగ్గర రోశయ్య శిష్యరికం చేశారు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో మిత్రుడు తిమ్మారెడ్డితో కలిసి రాజకీయ ఓనమాలు దిద్దాడు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలను నిర్వర్తించాడు. అటు పిమ్మట 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి సర్కార్‌లో హోంశాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలకు మంత్రిగా పని చేశారు. 2004, 2009లో వైఎస్సార్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995-97 మధ్యకాలంలో ఏపిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.