సీఎం జగన్ చెప్పింది ఇదేనట..!

Andhra Pradesh CM Jagan. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, సమన్వయకర్తలతో

By Medi Samrat  Published on  3 April 2023 10:55 AM GMT
సీఎం జగన్ చెప్పింది ఇదేనట..!

Andhra Pradesh CM Jagan


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. సంవత్సరంలో ఎన్నికలకు వెళుతున్నామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. ముందుగానే అసెంబ్లీని రద్దు చేయనున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంతకంటే తీవ్రంగా పుకార్లు వ్యాపింపజేస్తారని, టికెట్లు దక్కనివారి జాబితా ఇదేనంటూ 60 మంది పేర్లతో ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు. మనం యుద్ధం చేస్తోంది మారీచుల వంటి రాక్షసులతోనని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గుడు మరొకరు లేరు అన్నట్టుగా ఆయా ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవాలని జగన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది మొదటి ప్రాధాన్యత ఓట్లతో కాదని.. అందరూ ఏకం కావడం వల్ల వారికి రెండో ప్రాధాన్యత ఓటు లభించిందన్నారు. అది వాపే కానీ బలుపు కాదు.. అదే బలం అన్నట్టుగా కొన్ని మీడియా చానళ్లలో చూపిస్తున్నారన్నారు. 21 స్థానాలకు ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో గెలిచింది మనమేనని స్పష్టం చేశారు. నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.


Next Story