జేపీ నడ్డాను కలిసిన ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2024 10:16 AM ISTజేపీ నడ్డాను కలిసిన ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, ఆంధ్రప్రదేశ్‌ను అందాల్సిన వాటిపై అభిప్రాయాలు పంచుకున్నారు.
కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడం మరియు ఎన్‌డిఎ ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను పురోగతిలో కొత్త శిఖరాలకు చేర్చడంపై మేము విలువైన ఆలోచనలను పరస్పరం మార్చుకున్నామని జేపీ నడ్డా ట్విట్టర్ లో తెలిపారు. ప్రధాని మోదీ విజన్ అయిన 'విక్షిత్ భారత్'కు అనుగుణంగా రాష్ట్రాన్ని 'విక్షిత్ ఆంధ్ర' దిశగా ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటూ దేశ రాజధాని పర్యటనలో ఉన్నారు, ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రితో సమావేశమయ్యారు. ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.