ఉలిక్కిపడ్డ సత్యసాయి జిల్లా

ఏపీలో ఉగ్రవాదుల కలకలం రేగింది.

By -  Medi Samrat
Published on : 17 Oct 2025 9:00 PM IST

ఉలిక్కిపడ్డ సత్యసాయి జిల్లా

ఏపీలో ఉగ్రవాదుల కలకలం రేగింది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి సింగిల్ బ్యారెల్ రైఫిల్‌తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుస్సేన్, మహారాష్ట్ర‌కు చెందిన తౌఫిక్ అలాం షేక్ గా గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొద్దిరోజుల కిందట ధర్మవరంలో నూర్ మహ్మద్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం లోతుగా విచారించగా ధర్మవరంలో మరో ఇద్దరు ఉన్నట్లు నూర్ మహ్మాద్ తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ధర్మవరంలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేశారు.

Next Story