తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లితండాకు చెందిన మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

By Medi Samrat
Published on : 9 May 2025 2:45 PM IST

తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లితండాకు చెందిన మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాం నాయక్‌లతో ఫోన్‌లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం తెలిపారు. వీరజవాన్ మురళీ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిది అయినా.. ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు.

Next Story