నేడు ఆ ప్రాంతాలకు వెళ్ల‌నున్న‌ సీఎం చంద్రబాబు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదివారం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

By Medi Samrat  Published on  2 Feb 2025 6:45 AM IST
నేడు ఆ ప్రాంతాలకు వెళ్ల‌నున్న‌ సీఎం చంద్రబాబు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదివారం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారని తెలుస్తోంది.

మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌లో తన నివాసం నుంచి చంద్రబాబు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 5.50 గంటలకు 1 జన్‌ పథ్ నివాసానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో పర్యటించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.

Next Story