Chit Fund Scam : రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

Andhra CID issues notice to Ramoji Rao, daughter-in-law for questioning. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుకు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్‌కు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 March 2023 3:26 PM IST
Chit Fund Scam : రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

Andhra CID issues notice to Ramoji Rao, daughter-in-law for questioning


మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుకు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్‌కు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది. మార్చి 29, 31 లేదా ఏప్రిల్‌ 3, 6 తేదీల్లో ఎప్పుడైనా సీఐడీ విచారణకు రావాలని తెలిపారు. ఈ కేసులో ఏ1గా చెరుకూరి రామోజీరావును, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజను ఏ2గా సీఐడీ పేర్కొన్నారు. విచారణకు అందుబాటులో ఉండాలంటూ సీఐడీ డీఎస్పీ రవి కుమార్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏ2 చెరుకూరి శైలజకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. ఇళ్లు లేదంటే ఆఫీస్‌లో విచారణకు అందుబాటులో ఉంటే సరిపోతుందని సీఐడీ పేర్కొంది.

మార్గదర్శి చిట్ ఫండ్స్ నిబంధనలు ఉల్లంఘించిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొంత కాలంగా మార్గదర్శి చిట్ ఫండ్స్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. విచారణ సందర్భంగా మార్గదర్శి శాఖల్లో పనిచేస్తున్న కామినేని రామకృష్ణ (సీతమ్మధార), సత్తి రవిశంకర్ (రాజమండ్రి), శ్రీనివాసరావు(లబ్బీపేట), గొరిజవోలు శివరామకృష్ణ(గుంటూరు)ను అరెస్టు చేసింది. తర్వాత వాళ్లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. మొత్తం మూడు చట్టాల కింద కేసులు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982 లోని సెక్షన్ 76,79 ప్రకారం ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది. ఇందులో ఇన్వెస్టింగేటింగ్ అధారిటీగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉందని సీఐడీ తెలిపింది.

మార్చి 11న విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్రాంచ్‌లలో సీఐడీ బృందాలు సోదాలు నిర్వహించాయి.


Next Story