వైసీపీలో రోజాతో సమాన హోదా దక్కించుకున్న యాంకర్ శ్యామల

యాంకర్ శ్యామల.. అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో దశాబ్దానికి పైగా తెలుగు ప్రజలకు బాగా తెలుసు.

By Medi Samrat  Published on  14 Sept 2024 11:45 AM IST
వైసీపీలో రోజాతో సమాన హోదా దక్కించుకున్న యాంకర్ శ్యామల

యాంకర్ శ్యామల.. అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో దశాబ్దానికి పైగా తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆమె గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆమె ఇప్పుడు యాక్టివ్ రాజకీయాలతో బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైసీపీలో శ్యామలకు కీలక పదవిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టబెట్టారు.

పార్టీ అధ్యక్షులువై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావు, ఆర్.కె. రోజా, శ్యామల ను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారని వైసీపీ నుండి ప్రకటన వచ్చింది. వైసీపీలో కీలక మార్పులు చేస్తున్న వైఎస్ జగన్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నలుగురికి అవకాశం ఇచ్చారు. ఇందులో యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. వైసీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌ (పీఏసీ సభ్యుడు)గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగానూ బాధ్యతలు అప్పగించారు.

Next Story