సుప్రీం కోర్టులో అనంతబాబు బెయిల్ పై విచారణ

Anantha Babu's bail hearing in the Supreme Court. ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

By Medi Samrat  Published on  14 Nov 2022 11:45 AM GMT
సుప్రీం కోర్టులో అనంతబాబు బెయిల్ పై విచారణ

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. అనంతబాబు కుటుంబ సభ్యులు కేవిఎట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేసింది సుప్రీంకోర్ట్. రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు ఇప్పటికే అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేశాయి. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 26న జరిగిన విచారణ సందర్భంగా అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉంటున్నాడు. డ్రైవర్ హత్యకేసులో పోలీసులు 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయనందున అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను ఇటీవల రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఆగస్టు నెలలో అనంతబాబు తల్లి మంగారత్నం మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు అనంతబాబుకు మూడు రోజుల పాటు షరత్‌లతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.


Next Story