అరగంటలో స్కెచ్ వేయగలం : ఆనం వెంకట రమణారెడ్డి

Anam Venkata Ramana Reddy Fire On YSRCP Leaders. వైసీపీ దాడులకు తాము భయపడబోమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు.

By Medi Samrat
Published on : 5 Jun 2023 6:43 PM IST

అరగంటలో స్కెచ్ వేయగలం : ఆనం వెంకట రమణారెడ్డి

వైసీపీ దాడులకు తాము భయపడబోమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం టీడీపీ సంప్రదాయం కాదన్నారు. దాడులు మేం చేయలేమా? మీకు చేతనైంది మాకు చేతకాదా? మీరు చేసిన పని మేం చేయాలంటే ఎంత సేపు? దాడులు చేయడం మాకూ వచ్చు.. మేమూ చేయగలం.. అనుకుంటే అరగంటలో స్కెచ్ వేయగలమని అన్నారు. దాడులు చేయడం కాదు.. దమ్ముంటే రా జగన్.. ఎనీ టైం.. ఎనీ ప్లేస్.. ఎనీ వేర్.. ప్లేస్ నువ్వు చెప్పు.. ఇదేందండి ఇది.. పారిపోవడం ఏంటి? పది మంది పిలకాయల్ని మందు, గంజా తాగించి పంపిస్తారా? అని నిలదీశారు. ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెప్పాలని, తాము వస్తామని సవాల్ విసిరారు. రేపు టీడీపీ ప్రభుత్వం రాదని అనుకుంటున్నారా? మీ ఇళ్లలోకి దూరి దాడులు చేయాలని అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి.. అదే జరిగితే మీరు అయిపోతారని ఆనం వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. దాడులు చేసే సంస్కృతి టీడీపీలో లేదని, ఇకపైనా రాదని అన్నారు.


Next Story