నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్

నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat
Published on : 12 April 2025 2:45 PM IST

నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్

నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఊపిరాడక పది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకూ గ్యాస్ వ్యాపించిందని స్థానికులు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించారు.

Next Story