క‌రోనాను జ‌యించిన వైసీపీ ఎమ్మెల్యే.. రెండుసార్లు.!

Ambati Rambabu Recovered From Corona. ఒక్క‌సారి క‌రోనా వ‌స్తే మ‌ళ్లీ రాదు.. ఆ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌తో ఇక మాస్క్‌లు లేకుండానే

By Medi Samrat  Published on  15 Dec 2020 1:58 PM IST
క‌రోనాను జ‌యించిన వైసీపీ ఎమ్మెల్యే.. రెండుసార్లు.!

ఒక్క‌సారి క‌రోనా వ‌స్తే మ‌ళ్లీ రాదు.. ఆ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌తో ఇక మాస్క్‌లు లేకుండానే బ‌య‌ట తిర‌గొచ్చు అనుకుంటే పొర‌పాటే. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, వైద్యులు ఎంత హెచ్చ‌రిస్తున్నా ప్ర‌జ‌లు ఏ మాత్రం లెక్క చేయ‌డం లేదు. భౌతిక దూరం, మాస్క్‌, శానిటైజ‌ర్ ఈ ప‌దాల‌ను ప్ర‌జ‌లు ఎప్పుడో మ‌ర్చిపోయిన‌ట్టున్నారు. కానీ ఒక్క‌సారి సెకండ్ వేవ్ భార‌త్‌లో ప్రారంభ‌మైతే ఈసారి న‌ష్టం ఊహ‌ల‌కంద‌నిదిలా ఉంటుందనడంతో ఎలాంటి సందేహం లేదు.

రెండుసార్లు కరోనాకి గురైన వైసీపీ ఎమ్మెల్యే ఉదంతం ఇందుకు నిదర్శనం. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు రెండోసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గతంలో ఓసారి కరోనా బారినపడిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి టెస్ట్ చేయించుకున్నారు. రెండోసారి ఆయనకు పాజిటివ్ రావడంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది సోమ‌వారమే డిశ్జార్జి అయ్యారు.

మ‌ళ్లీ క‌రోనా క‌రోనా.. ఆశ్చ‌ర్యానికి గురి చేసింది..

జూలైలో నాకు కోవిడ్ వ‌చ్చి త‌గ్గిపోయింది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ నిన్న అసెంబ్లీలో కోవిడ్ టెస్ట్ చేయించిన‌ప్పుడు నేను చాలా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాను. రిపోర్టులు చూస్తే పాజిటివ్ అని వ‌చ్చాయి. మ‌ళ్లీ ఇన్ఫెక్ష‌న్ రావ‌డ‌మేంటో అర్థం కాలేదు. ఏదైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాను. అవ‌స‌ర‌మైతే అస్ప‌త్రిలో చేర‌తాను. మీ అంద‌రి ఆశీస్సుల‌తో మ‌రోసారి క‌రోనాను జ‌యించి మ‌ళ్లీ మీ ముందుకు వ‌స్తాను* అంటూ డిసెంబ‌ర్ 5వ తేదీన ఎమ్మెల్యే రాంబాబు ట్వీట్ చేశారు.

ఆందోళ‌న క‌లిగించినా.. ఆశీస్సుల‌తో జ‌యించా..

క‌రోనా వ‌చ్చింద‌ని ఒకింత ఆందోళ‌న క‌లిగించినా మీ ఆశీస్సుల‌తో విజ‌య‌వంతంగా ఎదుర్కోగ‌లిగాను. వైద్యుల స‌ల‌హా మేర‌కు హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్‌లో ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఈ రోజే గుంటూరు చేరాను. రెండోసారి ఇన్ఫెక్ష‌న్ వ‌స్తుంద‌ని అనుకోనేలేదు. త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తా* అంటూ డిసెంబ‌ర్ 14న అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.




Next Story