అదే ఏపీ ప్రజల నినాదం.. అందుకే 'పొత్తులు' అనే అందమైన పేర్లు పెట్టుకుంటున్నారు
Ambati Rambabu Fire On Chandrababu. చంద్రబాబు నినాదం.. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అయితే ప్రజల విధానం ఏమిటో 2019 ఎన్నికల్
By Medi Samrat Published on 6 May 2022 1:22 PM GMTచంద్రబాబు నినాదం.. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అయితే ప్రజల విధానం ఏమిటో 2019 ఎన్నికల్లో, ఆ తరవాత ప్రతి ఎన్నికల్లోనూ చూపించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 'గెటౌట్ చంద్రబాబు.. షటప్ చంద్రబాబు.. బైబై బాబు'' అని ఎన్ని సార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు సిగ్గు పడటం లేదని మంత్రి కౌంటరిచ్చారు. ధరల పెరుగుదల అన్నది సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుందని.. కానీ హెరిటేజ్ స్టోర్‌లో ధర మాత్రం చంద్రబాబు జేబులోకి వచ్చే లాభం మీద ఆధారపడి.. మార్కెట్ కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందని విమర్శించారు.
బాబు హయాంలో కందిపప్పు డబుల్ సెంచరీ కొడితే.. ఆయిల్ ధరలు కూడా ఇప్పటి స్థాయికి ఏడేళ్ళ క్రితమే చేరాయని గుర్తుచేశారు. డీజిల్ కానివ్వండి.. పెట్రోల్ కానివ్వండి.. ఏ ధర తీసుకున్నా.. మన పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఒక రూపాయి ఎక్కువగా ఉన్నందున చంద్రబాబు బృందం దాన్ని చాలా దుర్మార్గంగా చూపిస్తున్నారని.. తమ హయాంలో కూడా ఇదే పద్ధతిలో ఉందని ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు.
ఎంతసేపటికీ డీజిల్, పెట్రోల్ ధరల్లో ఉన్న ఆ ఒక్క రూపాయి.. అర్ధ రూపాయి తేడా గురించి చంద్రబాబు మాట్లాతుతున్నారని.. 2014–19 మధ్య బడ్జెట్లలో ఎంత ఆదాయం వచ్చిందో, 2019 నుంచి నేటి వరకు దాదాపు అంతే ఆదాయం వచ్చిందని తెలిపారు. అప్పుడు లేని కొవిడ్‌ను కూడా జగన్ ప్రభుత్వం.. అదే ఆదాయంతో ఎదుర్కొందని చెప్పటానికి చంద్రబాబుకు ధైర్యం ఉందా? అని నిలదీశారు.
ఏపీలో ప్రజా ఉద్యమం అవసరం అని చంద్రబాబు మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆ ప్రజా ఉద్యమం రావటం వల్లే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గోల అంతా.. దత్త పుత్రుడు– తాను ఇంతకు ముందు విడిపోయినట్టు ఆడిన డ్రామా ముగించటానికి.. మరో డ్రామా ఎలా ఆడాలా అన్నదేనని విమర్శించారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమ కాలీకుడైన చంద్రబాబు.. వైయస్సార్‌నీ ఒంటరిగా ఎదుర్కోలేకపోయారు.. వైయస్సార్ కొడుకుని ఒంటరిగా ఎదుర్కొనలేకపోయారని గుర్తుచేశారు. తన విధానాల ద్వారా.. తన నాయకత్వం ద్వారా అధికారం తెచ్చుకున్న జగన్‌ని ఒక్కడిగా ప్రజల్లో ఎదుర్కోవటం తన వల్ల కాదని చేతులెత్తేయటానికి.. ఉమ్మడిగా ఎదుర్కోవటం కోసం పొత్తులు అనే అందమైన పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.