బీజేపీని టార్గెట్ చేసిన అంబటి

Ambati Rambabu Criticise On BJP. భారతీయ జనతా పార్టీపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కు పెడుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  13 Jun 2022 11:12 AM IST
బీజేపీని టార్గెట్ చేసిన అంబటి

భారతీయ జనతా పార్టీపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కు పెడుతూ ఉన్నారు. బీజేపీకి ఏపీలో అంత స్కోప్ లేదని విమర్శిస్తూ వస్తున్నారు. బీజేపీ దేశంలో పెద్ద పార్టీ అయితే అయి ఉండొచ్చని, కానీ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి పెద్దగా పట్టు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఏపీలో బీజేపీ తుస్సేనని అంబటి రాంబాబు విమర్శించారు. ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో అంబటి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలో లేదు కాబట్టే బీజేపీ నేతలు కనిపిస్తున్నారని.. వారికి వచ్చిన ఓట్లశాతమెంత? అని ప్రశ్నించారు. ప్రచారం పొందాలన్న ఉబలాటంతోనే తనను ఏదో ఒకటి అంటున్నారని అంబటి అన్నారు. ప్రజాధనంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా అన్ని పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు.










Next Story