పవన్ కళ్యాణ్ కేవలం నటుడిగానే సక్సెస్ : అంబటి

Ambati Rambabu Comments On Pawan Kalyan. జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాదు శిల్పకళావేదికలో జరిగిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సు

By M.S.R  Published on  4 Dec 2022 4:36 PM IST
పవన్ కళ్యాణ్ కేవలం నటుడిగానే సక్సెస్ : అంబటి

జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాదు శిల్పకళావేదికలో జరిగిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ తాను ఒక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడ్ని అని అన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ రాజకీయాల్లో ఫెయిల్ అనేది వాస్తవం అని.. పవన్ కేవలం నటుడిగానే విజయవంతం అయ్యారని వెల్లడించారు. చాలా కాలం నుండి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా గెలిచింది లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇక ముందు కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక విధానం అంటూ ఏమీలేని పవన్, రాజకీయల్లో తన పాత్రను సరిగా పోషించలేకపోతున్నారని అన్నారు.

శిల్పాక‌ళా వేదిక‌లో జ‌రిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కండ‌క్ట్ చేసిన ఇంట‌ర్నేష‌న‌ల్ స‌ద‌స్సులో పాల్గొన్నారు. అక్క‌డ‌కు వ‌చ్చిన వారిని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తనని తాను ఫెయిల్డ్ పొలిటీషియన్ అని సంభోధించుకోవటంపై విద్యార్థులు ఒప్పుకోలేదు.


Next Story