ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులను ప్రధాని మోడీ కాసేపట్లో ప్రారంభించనున్నారు. కాగా అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనాలు రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాలచక్రం, ఎన్‌టీఆర్, బుద్ధుడు, సింహం, ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాలతో పాటు మేక్ ఇన్ ఇండియా లోగో ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు అమరావతి అక్షరాలు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా అందరీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.