రూ.11 వేల కోట్లతో అమరావతి పనులు.. లోన్ రిలీజ్‌కు ఓకే చెప్పిన హడ్కో

ఏపీ సర్కార్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ సంస్థ సమ్మతి తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

By Knakam Karthik
Published on : 23 Jan 2025 11:52 AM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Amaravati Capital, Hudco Loan

రూ.11 వేల కోట్లతో అమరావతి పనులు.. లోన్ రిలీజ్‌కు ఓకే చెప్పిన హడ్కో

ఏపీ సర్కార్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ సంస్థ సమ్మతి తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో హడ్కో తమ నిర్ణయాన్ని వెల్లడించినట్లుగా ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

ఇప్పటికే అమరావతి డెవలప్‌మెంట్‌పై ఏపీలోని కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల లభ్యతకు కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా, ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో అమరావతి నిర్మాణ పనులను ఏపీ సర్కార్ పట్టాలెక్కించింది. ఇప్పటికే ఆయా పరిసరాలను శుభ్రం చేయించిన ప్రభుత్వం, అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించేసింది. అటు అమరావతి నిర్మాణ పనులకు టెండర్లను కూడా పిలిచారు.

గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. ఏపీ రాజధాని ఏదంటే సమాధానం చెప్పలేని పరిస్థితిని క్రియేట్ చేసిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ డెవలప్‌మెంట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు.


Next Story