ఆ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే నేనే : ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా

By Medi Samrat  Published on  3 Jan 2024 2:52 PM IST
ఆ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే నేనే : ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని ఆర్కే పేర్కొన్నారు. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను కేవలం బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని వెల్లడించారు.

తామంతా కాంగ్రెస్ నుంచి వచ్చామని, తిరిగి అదే పార్టీలోకి వెళుతున్నామని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో షర్మిల పార్టీలో చేరతారని.. ఆమె తర్వాత తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం ముందు నుంచి ఉందని.. సంస్థాగతంగా బలమైన కార్యవర్గం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కచ్చితంగా ప్రతిపక్షం పోషిస్తానని, కాంగ్రెస్ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీ కలుస్తాయని తాను భావించడం లేదని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో న్యాయపోరాటం కొనసాగుతుందని.. తప్పు ఎవరు చేసినా తప్పేనని పునరుద్ఘాటించారు. ఇదిలావుంటే.. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

Next Story