వివేకా హ‌త్య‌ కేసు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన‌ అజయ్ కల్లం

Ajay Kallam approach Telangana High Court over cbi in YS Viveka murder case. వైఎస్‌ వివేకా హ‌త్య‌ కేసులో అజయ్ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

By Medi Samrat  Published on  29 July 2023 12:00 PM GMT
వివేకా హ‌త్య‌ కేసు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన‌ అజయ్ కల్లం

వైఎస్‌ వివేకా హ‌త్య‌ కేసులో అజయ్ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఫైనల్ చార్జ్‌షీట్‌లో సీబీఐ తన స్టేట్‌మెంట్‌ల‌ను వక్రీకరించిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తను చెప్పిన వాంగ్మూలాన్ని కాకుండా చార్జిషీట్‌లో మరో స్టేట్‌మెంట్‌ను సీబీఐ చేర్చిందనీ అజయ్ కల్లం తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఫైనల్ చార్జ్‌షీట్‌లో 290వ‌ సాక్షిగా ఏప్రిల్ 29న అజయ్ కల్లం స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసింది. సీఆర్‌పీసీ 161 ప్రకారం.. సీబీఐ నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిందని.. 25 నిమిషాల పాటు నన్ను సీబీఐ విచారించిందని అజయ్ కల్లం తన పిటిషన్ లో పేర్కొన్నారు.

నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి ఆడియో, వీడియో రికార్డింగ్ సీబీఐ చేయలేదు. నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత సీబీఐ నాకు కాపీ ఇవ్వలేదు. సీబీఐ నన్ను విచారించిన అంశం మూడో వ్యక్తికి కూడా తెలియదు. కానీ నేను సీబీఐకి స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు కొన్ని న్యూస్ పేపర్లు రాశాయి. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు పూర్తిగా విరుద్ధంగా సీబీఐ చార్జ్‌షీట్‌లో పెట్టింది. నన్ను విచారించింది ఎస్పీ వికాస్ కుమార్ ఐతే.. నా స్టేట్‌మెంట్‌ కింద సంతకం వేరే వారిది ఉన్నది. నేను సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. 2019 మార్చి 15న ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి వైఎస్ జగన్ ఇంట్లో 5 గంటలకు సమావేశం అయ్యాం. ఒక వ్యక్తి వచ్చి వివేకా చనిపోయినట్లు జగన్ కి చెప్పటంతో.. ఆయ‌న షాక్‌కు గురయ్యారు. నేను సీబీఐకి ఎక్కడా భారతి పేరు చెప్పలేదు.. కానీ జగన్ ను భారతి పిలిస్తే వెళ్లినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నేను ఎక్కడ భారతి పేరును సీబీఐకి చెప్పలేదు. సీబీఐ నా పేరుతో తప్పుడు స్టేట్‌మెంట్‌ను చార్జ్‌షీట్‌లో పెట్టింది. కోర్టు రికార్డులో ఉన్న చార్జ్‌షీట్‌లో నుండి నా స్టేట్‌మెంట్‌ను తొలగించాలని అజయ్ కోర్టును కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.


Next Story