Video: ఏపీలో అఘోరి అరాచకం.. పోలీసులపై దాడి

ఏపీలో అఘోరి అరాచకం సృష్టించింది. ఇవాళ ఉదయం మంగళగిరిలో కారు వాష్‌ చేయిస్తుండగా తనను వీడియో తీశాడంటూ ఓ జర్నలిస్టుపై దాడి చేసింది.

By అంజి  Published on  18 Nov 2024 11:33 AM IST
Aghori, APnews, Attack, AP Police, viral news

ఏపీలో అఘోరి అరాచకం.. పోలీసులపై దాడి

ఏపీలో అఘోరి అరాచకం సృష్టించింది. ఇవాళ ఉదయం మంగళగిరిలో కారు వాష్‌ చేయిస్తుండగా తనను వీడియో తీశాడంటూ ఓ జర్నలిస్టుపై దాడి చేసింది. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద హల్‌ చల్‌ చేసింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కలవాలంటూ నేషనల్‌ హైవేపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తను పవన్ కళ్యాణ్ ను కలవాలని, ఆయనను కలిసిన తర్వాతనే ఇక్కడ నుండి వెళతానంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించింది. ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని చెప్పింది.

ఈ క్రమంలో అడ్డుకోబోయిన పోలీసులపై తిరగబడిన అఘోరి.. దాడికి కూడా పాల్పడింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలి అంటూ నినాదాలు చేసింది. అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించిన పోలీసుల పైనా దాడి పాల్పడింది. దీంతో అక్కడ కాసేపు నాటకీయ వాతావరణం చోటుచేసుకుంది. కాగా అఘోరీ చర్యలను పలువురు తప్పుబడుతున్నారు. తాజా ఘటనకు సంబంధించిన అఘోరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story