వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

Aerial survey of CM Jagan in flood affected areas. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

By Medi Samrat  Published on  15 July 2022 3:39 PM IST
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్‌ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. విశాఖపట్నంలో వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బయలుదేరారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే చేపట్టిన తర్వాత వరదలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్షించనున్నారు.

గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. గురువారం ఉదయం నాటి గోదావరి వరద పరిస్థితి గురించి సీఎం ఇరిగేషన్‌ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.









Next Story