ఆడుదాం ఆంధ్ర.. మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని భారీగా సక్సెస్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది.
By Medi Samrat Published on 9 Dec 2023 7:45 PM ISTఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని భారీగా సక్సెస్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం. మరో రెండు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కడ్డీ లీగ్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, ఏపీ బ్యాడ్మెంట్ అసోసియేషన్, పీవీ సింధు, ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్ తోనూ ఒప్పందాలు చేసుకుంది. ఈ సంస్థల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ చేపట్టనున్నారు. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో చర్చలు సాగిస్తున్నారు. పలు లీగ్ లలో ఏపీ క్రీడాకారులకు అవకాశాలు కలిపించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందు కు Andhra Games competitions will be held from 15th of this monthను గ్రామ, మండలస్థాయి కమిటీల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. గ్రామసచివాలయాల పరిధిలో నిర్వహించే ఆడుదాం ఆంద్ర క్రీడల పోటీలకు సంబంధించి సచివాలయాలకు క్రీడా సామగ్రిని పంపుతున్నారు.