మోదీలా కాకుండా.. మీరు సెక్యులర్‌ అనే నమ్ముతున్నా: ప్రకాష్‌ రాజ్‌

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్‌ రాజ్‌ అభినందనలు తెలిపారు.

By అంజి  Published on  7 Jun 2024 6:15 AM IST
Actor Prakash Raj, Chandrababu, Pawan kalyan, Andhrapradesh

మోదీలా కాకుండా.. మీరు సెక్యులర్‌ అనే నమ్ముతున్నా: ప్రకాష్‌ రాజ్‌

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్‌ రాజ్‌ అభినందనలు తెలిపారు. చంద్రబాబు, పవన్‌తో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందన్న ఆయన.. ఎన్డీఏలో ఉన్నా మోదీలా కాకుండా సెక్యులర్‌ నాయకులుగానే వారు ఉంటారని నమ్ముతున్నానని అన్నారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీ, జనసేనకు వచ్చిన అవకాశంతో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అలాగే దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన బాధ్యత కూడా మీ (చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌)పై ఉందని ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. కనీవిని ఎరగని రీతిలో అఖండ మెజార్టీని సొంతం చేసుకుంది. మరోవైపు 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఐదేళ్లు తిరిగే సరికి అతి కష్టం మీద 11 సీట్లు సాధించగలిగింది. అంతే కాదు.. 21 సీట్లలో పోటీ చేసిన జనసేన.. 175 స్థానాల్లో పోటీ చేసిన జగన్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంది. పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

Next Story