ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు మంజూరుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబరు రెండో తేదీ నుంచి అర్హులైన వారి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబరు 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత రేషన్ కార్డుల మంజూరుపై అధికారులు ఒక నిర్ణయానికి రానున్నారు. సంక్రాంతి పండగ లోపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ది దారులను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
ఇదిలావుంటే.. ఇప్పటికే ఏపీలో 1.66 కోట్ల మంది రేషన్ కార్డుదారులున్నారు. వీరిలో తెలుపు రంగు రేషన్ కార్డులందరూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ హామీలకు అర్హత సాధించిన జాబితాలో ఉంటారు. గత కొంత కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు వేల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారందరికీ గుడ్‌న్యూస్ చెప్పింది.