కృష్ణా జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎక్సైజ్ కోర్ట్ ఏపిపి

కృష్ణా జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు ఓ అధికారిని పెట్టేసుకున్నారు.

By Medi Samrat  Published on  28 Aug 2023 3:15 PM GMT
కృష్ణా జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎక్సైజ్ కోర్ట్ ఏపిపి

కృష్ణా జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు ఓ అధికారిని పెట్టేసుకున్నారు. అవినీతి నిరోదక శాఖ అధికారులు రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా ఎక్సైజ్ కోర్ట్ ఏపిపి విజయలక్ష్మి, కానిస్టేబుల్ బాలకృష్ణ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత నేతృత్వంలో డీఎస్పీలు శ్రీనివాస్, శరత్ లతో కూడిన బృందం ఈ దాడులు చేపట్టింది. 498ఏ కేసులో మురళీకృష్ణను ఎపిపి విజయలక్ష్మి లంచం డిమాండ్ చేసింది. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏపిపి విజయలక్ష్మి సూచించినట్లు రూ.90వేల నగదును కానిస్టేబుల్ బాలకృష్ణకు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏపిపి విజయలక్ష్మితో పాటు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు.

ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత నేతృత్వంలో ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాస్, శరత్ ఈ దాడిని నిర్వహించారని అధికారులు తెలిపారు. బాధితుడు మురళీకృష్ణను ఏపీపీ విజయలక్ష్మి రూ.90వేలు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన రూ.90 వేలను కానిస్టేబుల్ బాలకృష్ణకు ఇవ్వాలని ఏపీపీ తెలిపారు. ఏపీపీ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ బాలకృష్ణకు బాధితుడు రూ.90వేలు ఇచ్చాడు. అయితే ఈ విషయంపై బాధితుడు ముందస్తుగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుుని ఏపీపీ, కానిస్టేబుల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ ఏఎస్పీ స్నేహిత తెలిపారు.

Next Story