పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు

ఈ ఉద‌యం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు.

By Medi Samrat  Published on  31 May 2024 6:24 PM IST
పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు

ఈ ఉద‌యం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో ఆయ‌న‌ పదవీ విరమణ చేశారు. ఈ రోజు ఉదయం ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన రోజే ఎబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. దీంతో పలువురు అధికారులు, స్నేహితులు, అభిమానులు ఏబీవీని కలిసి సంఘీభావం తెలిపారు. ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఎబీవీని కలసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కూడా ఎబీవీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story