నెరవేరని ప్రభుత్వ హామీ..రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్!

బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంతో ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి.

By -  Knakam Karthik
Published on : 31 March 2026 9:25 PM IST

AndhraPradesh, Aarogyasri, HealthCare, AP Government, PendingDues, CM Chandrababu

నెరవేరని ప్రభుత్వ హామీ..రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్!

విజయవాడ: బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంతో ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. సుమారు రూ. 3,000 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ (ASHA) ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నాటికి బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, మార్చి 31 వచ్చినా నిధులు విడుదల కాకపోవడంతో ఆసుపత్రులు సేవల నిలిపివేతకు పిలుపునిచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పేద రోగులకు వైద్య సేవలు అందడం కష్టతరం కానుంది.

Next Story