అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు ఏపీ వాసులు మృతి

అమెరికాలోని రాండాల్ఫ్ స‌మీపంలో సోమ‌వారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు (యూఎస్ కాల‌మానం ప్ర‌కారం) ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By అంజి  Published on  16 Oct 2024 8:05 AM IST
road accident, America, andhra pradesh

అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు ఏపీ వాసులు మృతి 

అమెరికాలోని రాండాల్ఫ్ స‌మీపంలో సోమ‌వారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు (యూఎస్ కాల‌మానం ప్ర‌కారం) ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు తెలుగువారు స‌హా ఐదుగురు ప్ర‌వాస భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఓ మ‌హిళ కూడా ఉన్నారు. ముగ్గురు తెలుగువారు ఏపీలోని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వాసులు. సౌత్ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహ‌నాలు ఒక‌దానొక‌టి ఢీకొన‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు టెక్సాస్ ప‌బ్లిక్ సేఫ్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని అక్క‌డి ప్ర‌వాస భార‌తీయులు పేర్కొన్నారు. కాగా, ఈ దుర్ఘ‌ట‌న‌ను మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు ప్ర‌వాస భార‌తీయ ప్ర‌తినిధులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించినవారికి గూడురుకు చెందిన తిరుమూరు గోపీ, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రాజినేనిశివ, హరితలుగా గుర్తించారు. హరిత భర్త సాయి చెన్ను తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story