పెంపుడు తల్లి క్రూరత్వం.. చిన్నారి ఒంటిపై వాతలు.. పనిచేయడం లేదని వేడినీళ్లు పోసి

A foster mother who tortured a nine-year-old child in West Godavari district. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ పెంపుడు తల్లి కూతురిని అతి క్రూరంగా

By అంజి  Published on  6 Feb 2022 9:07 AM IST
పెంపుడు తల్లి క్రూరత్వం.. చిన్నారి ఒంటిపై వాతలు.. పనిచేయడం లేదని వేడినీళ్లు పోసి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ పెంపుడు తల్లి కూతురిని అతి క్రూరంగా చిత్రహింసలకు గురి చేసింది. మాట వినడం లేదని తొమ్మిదేళ్ల చిన్నారి ఒంటిపై వాతలు పెట్టి వేడినీళ్లు పోసింది. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లిగూడేనికి చెందిన దుర్గ కుమార్తె నాగ వెంకటలక్ష్మి. బాలిక తల్లి దుర్గ విదేశాల్లో ఉంటోంది. కాగా చిన్నారిని రెండేళ్ల వయస్సు నుండి జంగారెడ్డిగూడెంలోని బాలాజీనగర్‌కు చెందిన లక్ష్మి పెంచుకుంటోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బాలిక రెండో తరగతి చదువుతోంది. శనివారం నాడు పాఠశాలకు వెళ్లింది.

ఈ క్రమంలోనే బాలికను తోటి విద్యార్థి తాకడంతో ఒక్కసారిగా ఏడ్చింది. బాలిక ఒంటి నిండా గాయాలు ఉండటాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు వెంటనే అధికారులకు ఇనఫర్మేషన్‌ ఇచ్చారు. బాలికను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి ఇంటి పనులన్నీ తనతో చేయిస్తోందని, మాట వినట్లేదని వేడినీళ్లు పోసేదని, శరీరంపై వాతలు పెట్టేదని.. ఈ క్రమంలోనే గాయాలు అయ్యాయని బాలిక తెలిపింది. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెంపుడు తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికీ బాలికకు నిందితురాలు తన పెంపుడు తల్లి అని తెలియదు.

Next Story