'అఖండ' ప్రదర్శిస్తున్న థియేట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం.. భ‌యంతో ప్రేక్షకులు ప‌రుగులు

A fire broke out in the theater where the movie 'Akhanda' was being screened. 'అఖండ' సినిమాను ప్రదర్శిస్తున్న రవిశంకర్‌ థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. థియేటర్‌ సౌండ్‌ సిస్టమ్‌ మంట్లలో చిక్కుకుంది.

By అంజి  Published on  6 Dec 2021 8:25 AM IST
అఖండ ప్రదర్శిస్తున్న థియేట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం.. భ‌యంతో ప్రేక్షకులు ప‌రుగులు

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన హిట్‌ సినిమా 'అఖండ'. ఈ సినిమా విడుదలైన రోజే బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ఇక అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్‌తో ముందుకు వెళ్తోంది. అయితే ఓ వైపు 'అఖండ' సినిమా అభిమానులను ఉర్రుతలూగిస్తుంటే.. మరో వైపు సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఫైర్‌ యాక్సిడెంట్లు జరగడం అటు అభిమానులను, ఇటు థియేటర్‌ యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా శ్రీకాకుళంలో 'అఖండ' సినిమాను ప్రదర్శిస్తున్న రవిశంకర్‌ థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. థియేటర్‌ సౌండ్‌ సిస్టమ్‌ మంట్లలో చిక్కుకుంది. సౌండి సిస్టమ్‌లో అధికంగా సౌండ్‌ పెట్టడం వల్లే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. స్క్రీన్‌ వెనుక ఉండే సౌండ్‌ సిస్టమ్‌లో మంటలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్‌ నుండి బయటకు పరుగులు తీశారు. అయితే మంటలను గమనించిన నిర్వాహకులు.. వెంటనే అదుపు చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది.

ఇటీవల వరంగల్‌ నగరంలో అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్‌ నగరంలోని జెమిని థియేటర్‌లో చోటు చేసుకుంది. జెమిని థియేటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రేక్షకులు సినిమా చూస్తుండగానే థియేటర్‌లో పొగలు అలుముకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు థియేటర్‌ బయటకు పరుగులు తీశారు. థియేటర్‌ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Next Story