ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు

878 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,173 పరీక్షలు నిర్వహించగా.. 878 కేసులు

By Medi Samrat  Published on  30 Aug 2021 11:31 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,173 పరీక్షలు నిర్వహించగా.. 878 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,13,001 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 13 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,838కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,182 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,84,301కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,65,76,995 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.Next Story
Share it