ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 37,553 పరీక్షలు నిర్వహించగా.. 839 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు శనివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,80,602కి చేరింది. కరోనా వల్ల నిన్న ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,503గా ఉంది. 24 గంటల వ్యవధిలో 150 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,62,440కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,659 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,15,67,472 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.