ఏపీ క‌రోనా బులిటెన్‌ : భారీగా త‌గ్గిన కేసులు.. టెన్ష‌న్ పెడుతున్న మ‌ర‌ణాలు

7943 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 83,461

By Medi Samrat  Published on  31 May 2021 5:01 PM IST
ఏపీ క‌రోనా బులిటెన్‌ : భారీగా త‌గ్గిన కేసులు.. టెన్ష‌న్ పెడుతున్న మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 83,461 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 7,943 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,93,085కి చేరింది. నిన్న 19,845 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 15,28,360కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదిహేను మంది, పశ్చిమ గోదావరిలో పన్నెం డు మంది, ప్రకాశంలో పది, అనంతపూర్ లో తొమ్మి ది, తూర్పు గోదావరి లో ఎనిమిది, విశాఖపట్నం లో ఎనిమిది, శ్రీకాకుళం లో ఏడుగురు, కృష్ణ లో ఆరుగురు, కర్నూ ల్ లో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, గుంటూరు లో నలుగురు, నెల్లూరు లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు చొప్పున మొత్తం 98 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,930కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,53,795 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,92,56,304 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story