ఏపీ కరోనా బులిటెన్.. 24 గంటల్లో 58 మంది మృతి
6770 New Corona Cases Reported In AP. ఏపీలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్
By Medi Samrat Published on 13 Jun 2021 11:36 AM GMTఏపీలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,02,876 శాంపిళ్లను పరీక్షించగా.. 6,770 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,09,844కి చేరింది. నిన్న 12,492 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,12,267కి పెరిగింది.
#COVIDUpdates: 13/06/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 13, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,06,949 పాజిటివ్ కేసు లకు గాను
*17,09,372 మంది డిశ్చార్జ్ కాగా
*11,940 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,637#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/pcyaWH9OJP
కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, తూర్పు గోదావరిలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు చొప్పున మొత్తం 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,940కి చేరింది. ఇక రాష్ట్రంలో 85,637 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,04,50,982 సాంపిల్స్ ని పరీక్షించారు.