ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 667 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిదిమంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,033కు చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 8,71,972కు చేరింది. తాజాగా 914 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,910 యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,04,10,612 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 105 పాజిటివ్ కేసులు, గుంటూరులో 114, కృష్ణలో 129 కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదయ్యాయి.